రేపే జమ్మూకశ్మీర్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం
జమ్మూకశ్మీర్ ముఖ్యమం త్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి ఆహ్వాన లేఖ అందిందని ‘ఎక్స్’ వేదికగా ఒమర్ వెల్లడించారు.


 
							 
							