తెలంగాణాలో విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు
తెలంగాణాలో గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణాలో ఉన్న అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణాలో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో తెలంగాణా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించాలని విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు.


 
							 
							