Home Page SliderNational

రైతుని కోటీశ్వరుడిని చేసిన టమాటాలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. దీంతో టమాటాలు సామాన్యుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. అయితే రైతులను మాత్రం కోటీశ్వరులుగా చేస్తున్నాయి.  కాగా మహరాష్ట్రలోని ఓ రైతు టమాటాలు అమ్మి ఏకంగా కోటిశ్వరుడయ్యాడు. పూణె జిల్లా జున్నార్‌కు చెందిన భాగోజీ గయాకర్ అనే రైతు 12 ఎకరాల్లో టామాటా సాగుచేశారు. గత నెలలో ఈ రైతు 20 కిలోలు గల 13 వేల టమాటా డబ్బాలను విక్రయించారు. దీంతో ఆయనకు రూ.1.5 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే నిన్న శుక్రవారం ఒక్కరోజే ఆయన 900 వందల డబ్బాలను విక్రయించి రూ.18లక్షల ఆదాయం పొందారు.  కాగా ఒక్కో డబ్బాను రూ.1000 నుంచి రూ.2,400 వరకు విక్రయించినట్లు రైతు గయాకర్ వెల్లడించారు.