Home Page SliderInternational

అంతరిక్షంలో పండించిన టమాటాలు..భూమి మీదకి రానున్న వేళ

“టమాటాలండీ..టమాటాలు” ఎక్కడ పండించారో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. దీనిలో షాక్ అయ్యే విషయం ఏముంది టమాటాలను భూమిలోనే కదా మనం పండిస్తాం అంటారేమో..! ఇది నిజమే అయినప్పటికీ ఈ టమాటాలను మాత్రం భూమిలో పండించలేదు. మరి ఎక్కడ పండించారనుకుంటున్నారా?  నాసా వీటిని అంతరిక్షంలో పండించింది. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2000 kgల టమాటాలను నాసా అంతరిక్షంలోని ISS మినియేచర్ గ్రీన్ హౌస్ ప్రయోగశాలలో పండించింది. కాగా వీటిని నాసా ఈ రోజు భూమి మీదకు తీసుకురాబోతుంది. CRS-27 కార్గో స్పేస్ క్రాఫ్ట్‌లో 2,000 KGల టమాటాలను తీసుకువస్తున్నామని నాసా తాజాగా ప్రకటించింది. ఈ పంటను పండించడానికి 90-100 రోజుల సమయం పట్టిందని నాసా పేర్కొంది. ఈ టమాటాలలోని పోషక విలువలను కూడా పరీక్షించామని తెలిపింది. ఈ ప్రయోగంతో అంతరిక్షంలో మొక్కలు పెరిగే సామర్థాన్ని తెలుసుకోవచ్చని నాసా స్పష్టం చేసింది.