Home Page SliderNational

“టమాటా మరో నెలరోజులు మన మాట వినదంట”

దేశంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. దీంతో దేశంలోని సామాన్య,మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన టమాటా ధరలు మరో నెల రోజులపాటు ఇలానే కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా ఇటీవల కాలంలో మార్కెట్‌లో కేజీ టమాటా ధర రూ.100కి పైగా పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ విధంగా టమాటా ధరలు 50 రోజులపాటు ఇలా కొనసాగడం ఇదే తొలిసారని వారు చెప్తున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్,జూలై నెలలో టమాటా ధరలు తగ్గుతాయి. అయితే ఈసారి మాత్రం విపరీతంగా పెరిగాయని అంటున్నారు. కాగా గతేడాది జూలై 1-31 మధ్య కేజీ టమాట ధర రూ.60 నుంచి రూ.20 కి తగ్గిందన్నారు. కానీ ఈ ఏడాది మాత్రం రూ.40 నుంచి ఏకంగా రూ.120 వరకు పెరిగిందని మార్కెట్ నిపుణులు తెలిపారు.