home page sliderHome Page SliderTelangana

మహానగరంలో టమోటా ఫెస్టివల్..

భారత్ లో మొట్టమొదటి టమోటా ఫెస్టివల్ కు హైదరాబాద్ వేదికైంది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పలువురు పార్టిసిపేంట్స్ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. స్పెయిన్ లోని బునోల్లో ఏటా నిర్వహించబడే ఐకానిక్ లా టొమాటినా పండుగను మరిపించేలా ఈ ఫెస్టివల్ ను ఎక్స్ పీరియం పార్కులో నిర్వహించా రు. మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన అందగత్తెలు ఉల్లాసభరితమైన టమోటా విసరడం మరియు ఉత్సాహభరితమైన ఉత్సవాలలో ఆనందించారు. విశిష్ట అతిథులలో మిస్ ఇటలీ కోరి గోన్జ్, మిస్ జమైకా చియా ఎస్పోసిటో, మిస్ నమీబియా టాప్టే బెనెట్, మిస్జిబ్రాల్టార్ సెల్మా కామాన్యా, మిస్ శ్రీలంక షేనియా బల్లెస్టర్ తదితరులున్నారు. టమోటా టెర్రా విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవ వేదికపై పలు దేశాల అందగత్తెలు ఆనందం వ్యక్తం చేస్తూ నృత్యాలు చేశారు.