Home Page SliderNational

“నేను స్టార్ అవడానికి కారణం టాలీవుడే”:కమల్ హాసన్

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమా “భారతీయుడు-2”.కాగా ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కాగా ఈవెంట్‌లో పాల్గొన్న కమల్ హాసన్ టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను స్టార్ అవ్వడానికి కారణం తెలుగు ఇండస్ట్రీయే అన్నారు. సాగరసంగమం,మరో చరిత్ర,స్వాతిముత్యం వంటి అద్భుత విజయాలు ఇక్కడే దక్కాయని ఆన గుర్తు చేసుకున్నారు. కాగా  1996లో విడుదలైన భారతీయుడుకు అసలు తెలుగులో వసూళ్లు వస్తాయా రావా అని సందేహాలు వచ్చాయన్నారు. అయితే ఊహించని రీతిలో తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చిందని కమల్ తెలిపారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులు భారతీయుడు-2 ను ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు.