Andhra PradeshNews

అద్భుత చిత్రాలు రూపొందించిన టాలీవుడ్ దర్శకుడు మృతి

టాలీవుడ్‌ యువ దర్శకుడు మదన్ మృతి చెందారు. ఆ నలుగురు మూనీలో రైటర్‌గా పరిచయమైన మదన్ ఆ తర్వాత దర్శకుడిగా రాణించారు. పెళ్లయిన కొత్తలో చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గాయత్రి, గరం, కాఫీ విత్ మై వైఫ్, గుండె ఝల్లుమంది సినిమాలకు దర్శకత్వం వహించి… విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా పేరుపొందారు. మదన్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన మదన్.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. శనివారం అర్ధరాత్రి ఆయన ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానంలో మదన్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు.