Home Page SliderTelangana

టోల్ ప్లాజా ఉద్యోగిపై దాడి..

టోల్‌ప్లాజా వద్ద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై ఓ వాహనదారుడు దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద ఘటన జరిగింది. టోల్‌ ఛార్జీ చెల్లించాలని కోరిన తనపై.. వాహనదారుడు అసభ్య పదజాలంతో దాడికి పాల్పడినట్టు టోల్‌ ప్లాజా ఉద్యోగి ఆరోపిస్తున్నాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు టోల్ ప్లాజా చేరుకుని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. వాహనదారుడు రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్‌కు చెందిన సంతోష్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు.