నేటి అర్థరాత్రి నుండి టోల్ చార్జీల వడ్డింపు షురూ
సొంతకారులో సొంతూరుకు ప్రయాణమవుతున్నారా? అయితే టోల్ చార్జీల బాదుడుకి సిద్ధంగా ఉండండి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్‌చార్జీల మోత మ్రోగనుంది. నేటి అర్థరాత్రి నుండే ఈ చార్జీలు అమలులోకి రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుండి టోల్ చార్జీల పెంపు సాధారణంగా జరుగుతోంది. గత సంవత్సరం 8శాతం నుండి 15 శాతానికి టోల్ రేట్లు పెరిగాయి. ఈ ఏడాది 5.5 శాతం పెంపుదల ఉంటుందని ప్రకటించింది.. దీనివల్ల ప్రతి నూరు రూపాయలకు మరో ఐదు రూపాయల చొప్పున అదనపు భారం పడబోతోంది. ఇలా పెరిగిన చార్జీల ద్వారా ప్రభుత్వానికి రెండువేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు.