Home Page SliderTelangana

రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాసరెడ్డి, ఎల్బీ నగర్ నుంచి సామా రంగారెడ్డికి టికెట్లు ఖరారు

బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో యువతకు పార్టీ పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. పార్టీ విధేయులతోపాటుగా రేసు గుర్రాలకు అవకాశం కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎల్బీ నగర్ నుంచి సామా రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాసరెడ్డికి పార్టీ ఛాన్స్ ఇచ్చింది. అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మేకల సారంగపాణి, ఆర్టీసీ యూనియన్ నాయకుడు అశ్వద్ధామరెడ్డికి వనపర్తి నుంచి పార్టీ అవకాశం ఇచ్చింది.