Home Page SliderTelangana

కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు

మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కు బీజేపీ నేతలు టులెట్ ఫర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అనే బోర్డు తగిలించారు. అంతేగాక వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే బోర్డు కూడా ఏర్పాటు చేసి, నిరసన తెలియజేశారు. దీంతో అక్కడ ఇవాళ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా.. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. కేసీఆర్ డౌన్, డౌన్ అని, కేసీఆర్ బయటికి రావాలి అని పలు నినాదాలు చేసుకుంటూ వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే అనే ఫ్లకార్డులను ప్రదర్శించారు. పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి తరలించారు.