Andhra PradeshHome Page Slider

ఏపీలో రెండు రోజులు వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న రెండు రోజులపాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ద్రోని తోపాటు నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కొమరాడలలో వర్షం పడింది. అక్కడక్కడ ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో మామిడి, నిమ్మ, అరటి తోటలు నేల కొరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదర్భ నుండి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోని కొనసాగుతుందని అన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో స్వల్పంగా ఎండ తీవ్రత తగ్గనుంది. అలాగే ఆదివారం అక్కడక్కడ తేలిక పాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు ఆదివారం గుంటూరు ,పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.