నేడు వైయస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ
వరుసగా మూడో ఏడాది వైయస్సార్ ఆసరా పథకాన్ని శనివారం ఏలూరు జిల్లా దెందులూరు లో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి డ్వాక్రా గ్రూపు సంఘాల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయనున్నారు.798,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మహిళలకు మూడవ విడత ఆసరా కింద 6419.89 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఆసరా పథకాన్ని 10 రోజులపాటు ఏప్రిల్ 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.మూడో ఏడాది అందిస్తున్న 6,419.89 కోట్లతో కలిపి వైయస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు మొత్తం 19178 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్ది వారి కుటుంబాలకు సుస్థిరమైన ఆదాయం వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.