నేడు భద్రాద్రి రామయ్య మహా పట్టాభిషేకం..
ఆదివారం చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. నేడు సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి మహా పట్టాభిషేకం జరగనుంది. కళ్యాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. నేడు మహా పట్టాభిషేకం సందర్భంగా కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం మహా పట్టాభిషేకం జరుగుతుంది. ఈ వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. దేవాదాయ శాఖా మంత్రి కొండాసురేఖ మీడియాతో మాట్లాడుతూ మాడవీధుల విస్తరణకు ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసిందని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరహాలో భద్రాచలం అభివృద్ధి చేస్తామని తెలియజేశారు.