నేడు గంగావతరణ దినం..ఎలా పూజ చేయాలంటే..?
భారతీయులు గంగానదిని పరమ పవిత్రంగా భావిస్తారు. అలనాడు భగీధరుడు గంగను భూమికి తెచ్చిన రోజు. దీనిని గంగావతరణ దినంగా భావించవచ్చు. గంగావతరణ దినం జ్యేష్ఠ శుద్ధదశమి, గంగ దివినుండి భువికి అవతరించిన రోజు. సఖల పాపాలనుంచి విముక్తి కలిగించే రోజు. గంగను పూజించడం సేవించడం సమీప నదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి. నది లభ్యం కానప్పుడు వాపీకూప తటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేయాలి. నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా! విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ!! భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ ద్వాదశైతాని నామాని నామాని యత్ర యత్ర జలాశయే! స్నానకాలే పఠేన్నిత్యం మహాపాత నాశనమ్!! ఈ పన్నెండు నామాలతో గంగను స్మరిస్తే పాప హరణం జరుగుతుందని పండితులు చెప్తున్నారు.

