నేడు చంద్రబాబుకు మరోసారి ఆస్పత్రిలో హెల్త్ చెకప్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు డాక్టర్లు ఇవాళ మరోసారి హెల్త్ చెకప్ చేస్తారు. ఉ.11 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఎడ్మిట్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత గత గురువారం ఆస్పత్రిలో చేరిన ఆయనకు డాక్టర్లు బ్లడ్, యూరిన్, అలెర్జీ వంటి టెస్ట్‌లను చేశారు. డాక్టర్ల సూచన మేరకు సీబీఎన్ నేడు మరోసారి ఆస్పత్రిలో అన్ని టెస్టులు చేయించుకోనున్న చంద్రబాబు.