Home Page SliderTelangana

నేడు BRS రైతు దీక్షలు అన్ని కేంద్రాలలో ప్రారంభించింది

తెలంగాణ: బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షను ప్రారంభించింది. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పార్టీశ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శనివారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సాగునీరు ఇవ్వకుండా, రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వరి పంటకు బోనస్ ఇవ్వకుండా, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ప్రకటించకుండా రైతులను మోసం చేస్తోందని, అందుకు నిరసనగా శనివారం అన్ని నియోజకవర్గాలలో రైతుదీక్ష నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు.