Home Page SliderTelangana

రైతు రుణమాఫీ ఎవరికి వర్తిసుంది..ఎవరికి వర్తించదు అంటే..?

తెలంగాణాలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీ షెడ్యూల్ చేసిన రుణాలకు రూ.2,00,000 రుణమాఫీ వర్తించదని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో వాణిజ్య బ్యాంకులు,ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ,పీఏసీఎస్  నుంచి తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. అయితే SHG,JLG,RMG,LECS రుణాలకు రుణమాఫీ వర్తించదని తెలిపింది. కాగా ఈ రుణమాఫీపై రైతుల సందేహాలను తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖకు తెలంగాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.