Andhra PradeshHome Page Slider

పంది కొవ్వు కేజీ 1,400/-..! 320/- రూ. నెయ్యిలో ఎలా కలుపుతారు..?

తిరుమల లడ్డూ అంశంలో నిజానిజాలు వెలికితీయాలని న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంది కొవ్వు కేజీ రూ. 1,400 వరకు ఉంటుంది. రూ.320కి సరఫరా చేసే నెయ్యిలో అంతకంటే ఖరీదైన వస్తువుతో కల్తీ చేస్తారా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇత్తడిలో ఎవరైనా బంగారం కలుపుతారా? సెట్ తో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం ఏంటి అని మండిపడ్డారు.

వైవీ సుబ్బారెడ్డి 2019 నుంచి 2023 ఆగస్టు వరకు ఛైర్మన్గ్ గా ఉన్నారని పొన్నవోలు గుర్తు చేశారు. అప్పుడు ఆ హయాంలో ఏఆర్ ఫుడ్స్ టెండర్ దక్కలేదు.. ఈయనకు ఎలాంటి సప్లయి చేయడానికి అధికారం కూడా లేదు. ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు. కరుణాకర్ రెడ్డి హయాంలో కూడా ఏఆర్ ఫుడ్ లో ఒక గ్రాము కూడా సప్లయి చేయలేదని గుర్తు చేశారు. మీ హయాంలోనే ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.