ప్రపంచ ఆరోగ్య సంస్థకు మేమున్నాం..చైనా
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అమెరికా వైదొలగాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చైనా కీలక ప్రకటన చేసింది. చైనా మద్దతు ఎప్పుడూ ఆరోగ్య సంస్థకు ఉంటుందని వెల్లడించింది. యూఎస్ వైదొలగడంపై చైనా అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థను బలోపేతం చేయాలి తప్ప, బలహీన పరచకూడదు అని పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ అమెరికా పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.