Home Page SliderTelangana

ప్రధాని మోడీకి.. జనహారతి

హైదరాబాద్: ఓవైపు అభిమానులు.. మరోవైపు కాషాయ శ్రేణులు.. ఎటుచూసినా నమో.. మోడీ.. నినాదాలు.. నగరం నడిబొడ్డున సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో కోలాహలంగా సాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ వరకు పరిసరాలన్నీ జనంతో కిటకిటలాడాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ బోనాలు, లంబాడీ నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. రెండున్నర కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోకు వేల మంది పోలీసులతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన అమీర్‌పేటలోని గురుద్వారాను సందర్శించారు.