Andhra PradeshHome Page Slider

తిరుపతి సీటు స్థానిక బలిజలకే ఇవ్వాలి… ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ రచ్చ

మన తిరుపతి-మన బలిజలు పేరిట రౌండ్ టేబుల్ సమావేశం

స్థానిక నాయకులు ఒకటి ఆలోచిస్తుంటే.. పార్టీ హైకమాండ్ మరోలా ఆలోచిస్తోందన్నట్టుగా ఉంది తిరుపతి రాజకీయం. తిరుపతిలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జనసేన జెండా ఎగురేయాలని స్థానిక బలిజ వర్గీయులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా చాన్నాళ్లుగా జనసేనకు మద్దతుగా రాజకీయం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి జనసేన టికెట్ ఖరారవుతోందన్న వార్తల నడము, స్థానిక బలిజలకే టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన ఊపందుకుంటోంది.

మన తరుపతి-మన బలిజలు పేరిట… బలిజసేన ఆధ్వర్యంలో తిరుపతిలో ఆ వర్గీయులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి నుంచి ఏ పార్టీ అయినా బలిజ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతిలో తాము పట్టు నిలబెట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు. స్థానిక బలిజలకు అన్యాయం ఎక్కువవుతోందన్నారు. 2019లో బలిజలు గెలిచినప్పటికీ ఓడినట్టు ధ్రువపరిచి.. తమను అవమానించారని… అందుకు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని బలిజలు ఎదురు చూస్తున్నారన్నారు.

ఇతర పార్టీల నేతలు జనసేనలో చేరుతున్నారని విమర్శించారు. స్థానిక బలిజలకు టికెట్ ఇస్తే వారికే ఓటేస్తామన్నారు. తిరుపతిలో పుట్టిన ప్రతి బలిజ కూడా స్థానికులకే ఓటేయాలంటున్నారు. టీడీపీ, వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని వారు చెప్పారు. తిరుపతి సీటు జనసేన కొడుతుందని చెప్పారు. 50 డివిజన్లలో 50 మంది ఉన్నారంటున్నారు.