Andhra PradeshHome Page Slider

తిరుపతి లడ్డూలకు ఇకమీదట ఆ నెయ్యి వాడరట

తిరుమల తిరుపతి వెంకన్న దర్శనం కోసం గంటలు గంటలు పడిగాపులు కాసిన భక్తులకు, దర్శనం అయిన వెంటనే చేతిలో పెట్టే  ప్రసాదం లడ్డూ అంటే ఎంతో ఇష్టం. తిరుపతి లడ్డూలో కర్ణాటకకు కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యి వాడేవారు.  అయితే ఇకమీదట ఈ లడ్డూలకు నందిని నెయ్యి వాడరట. ఆ శ్రీవారిపై ప్రజలకు ఎంత భక్తి ఉందో తిరుపతి దేవస్థానంలో లభించే లడ్డూలంటే అంత ప్రేమ. తిరుపతిలో లభ్యమయ్యే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లడ్డూను భక్తులు మిస్ కాకుండా రుచి చూడాల్సిందే. ఈ నెయ్యిని గత 50 ఏళ్లుగా టీటీడీ  లడ్డూ తయారీలో వాడుతోంది. ఇప్పుడు నందిని నెయ్యికి, తిరుపతి లడ్డూకి సంబంధం తెగిపోయింది. కర్ణాటకలో పాల కొరత ఉన్నందున, దాని ఉత్పత్తుల ధరలను పెంచడం కూడా మనకు అనివార్యం. అందుకే నందిని నెయ్యి ధర కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో నందిని నెయ్యిని తక్కువ ధరలకు విక్రయించకూడదని కేఎంఎఫ్ నిర్ణయించింది. తిరుపతికి 6 నెలల్లో 14 లక్షల కిలోల నెయ్యి అవసరం అవుతుంది. దీనికి నందిని నెయ్యినే వాడేవారు. ఇప్పటి వరకు ఆలయానికి రాయితీపై నెయ్యి సరఫరా చేసేవారు. కానీ, ఈసారి తక్కువ ధరకు నెయ్యి అందించలేమని చెప్పి నందిని నెయ్యి తగ్గింపు ధరకు అందించే టెండర్ ను కేఎంఎఫ్ విరమించుకుంది.

ఆగస్టు 1 నుంచి పాల ధరలు పెంచడంతో నెయ్యికి ఎక్కువ ధర ఇవ్వాలని డిమాండ్ చేశామని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేశారు. ఈ నెయ్యి దాని నాణ్యత కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ను కలిగి ఉంది. ఏదైనా కంపెనీ తక్కువ ధరకు బిడ్ వేస్తే, నాణ్యత విషయంలో రాజీ పడుతుందని, లడ్డూలకు రుచిని అందించడంలో నందిని నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. గత మార్చిలో నెయ్యి కొనుగోలుకు టిటిడి టెండర్లు పిలువగా, దానిలో ఈ కేఎంఎఫ్ పాల్గొనలేదని టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. గతంలో కూడా ఒకసారి ఎల్‌1 టెండర్ వేరే కంపెనీకి వస్తే, వారితో మాట్లాడి, ఎల్2గా వచ్చిన కేఎంఎఫ్ నుండే నెయ్యి కొనుగోలు చేశామని తెలిపారు ఈవో. ఈ- టెండర్ల ద్వారానే టిటిడి కొనుగోళ్లు జరుగుతాయని, నామినేషన్ పద్దతిలో నిత్యావసర వస్తువులను కొనదని ఆయన పేర్కొన్నారు.