Andhra PradeshBreaking NewsHome Page Slider

తిరుప‌తి హంత‌కుల అరెస్ట్‌

గ‌త ఏడాది డిసెంబ‌ర్ చివ‌రి రోజున తిరుప‌తిలోని ఇందిరా ప్రియ‌ద‌ర్శిని కూర‌గాయ‌ల మార్కెట్ ద‌గ్గ‌ర జ‌రిగిన హ‌త్య కేసును పోలీసులు చేధించారు. ఎస్ఎంఎస్ ట్రేడర్స్ యజమాని మహబూబ్ బాషా ఫిర్యాదు మేరకు ద‌ర్యాప్తు చేప‌ట్టిన తిరుప‌తి ఈస్ట్ పోలీసులు రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే హంత‌కుల‌ను ప‌ట్టుకున్నారు. జై శ్యాం థియేట‌ర్ స‌మీపంలో ఓ ఇంట్లో త‌ల‌దాచుకున్నార‌న్న స‌మాచారంతో పోలీసులు మాటు వేసి నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.పూల వీధికి చెందిన మరి కుంట రుద్ర. చిన్న బజారు వీధి కి చెందిన మరికుంట కళ్యాణ్ కుమార్, పూల వీధికి చెందినమరి కుంట యశ్వంత్ కుమార్ లు ఈ హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.వారి నుంచి ఓ ద్విచక్ర వాహనాన్ని, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.నిందితుల‌ను న్యాయ‌మూర్తి ఎదుట హాజ‌రు ప‌ర‌చ‌గా రిమాండ్ విధించారు.

BREAKING NEWS: ప్రశాంత్ కిశోర్ అరెస్టు