Home Page SliderInternational

వేలంలో కోట్ల విలువ పలికిన టిప్పు ఖడ్గం

టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఓ అపూర్వ ఖడ్గం వేలంలో ఏకంగా 144 కోట్ల రూపాయల ధర పలికింది. దీనిని లండన్‌లోని బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ వేలం వేసింది. ఇది లండన్ కరెన్సీలో 1,40,80,900 పౌండ్లకు అమ్ముడు పోయిందట. దీనిని భారత కరెన్సీలో 144 కోట్ల రూపాయలుగా లెక్కకట్టారు. దీనికోసం ముగ్గురు తీవ్రంగా పోటీ పడ్డారని, చివరకు ఒకరు సొంతం చేసుకున్నారని, తాము అంచనా వేసిన ధర కంటే ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడు పోయిందని, ఈ ఆక్షన్ హౌస్ తెలిపింది. దీనిని గతంలో విజయ్ మాల్యా కొనుగోలు చేసి, తిరిగి అమ్మేసినట్లు సమాచారం. దీనికారణంగా తనకు దురదృష్టం వచ్చిందని 2016లో మాల్యా ప్రకటించారు. ఇది టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఆయుధాలలో అత్యంత శక్తి వంతమైన ఆయుధంగా భావిస్తారు. ఇప్పుడు దీనిని ఎవరు సొంతం చేసుకున్నారో వివరాలు చెప్పడానికి నిర్వాహకులు ఒప్పుకోలేదు.