Home Page SliderNational

బీజేపీని కుక్కతో మార్చే సమయం ఆసన్నమైంది…

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకెళ్తున్నాయి. స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మరో వివాదానికి తెరలేపుతూ బీజేపీని కుక్కతో పోల్చారు. అకోలాలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనను తాను దేవుడిగా భ్రమపడుతున్నారని విమర్శించారు. ఓబీసీ కమ్యూనిటీపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదన్న ఆయన.. “మిమ్మల్ని కుక్కలు అంటున్న బీజేపీకి అకోలా జిల్లాలోని ఓబీసీలు ఓటేస్తారా?” అని ప్రశ్నించారు. బీజేపీని ఇప్పుడు కుక్కలా మార్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి బీజేపీని పారదోలే సమయం ఆసన్నమైందన్న నానా పటోలే.. . పలు అబద్ధాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు దాని స్థానమేంటో చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు.