Home Page SliderNational

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ముహుర్తం ఫిక్స్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ గురించి ప్రకటించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా వారి భేటీ ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ముహుర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజా భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు,రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు.  అయితే వీటిలో 9,10 వ షెడ్యూల్‌లోని సంస్థల పంపిణీ,విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.