Home Page SliderTelangana

టైం.. డేట్ డిసైడ్ చేయ్.. నేను రెడీ..!

సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం సవాల్ కు తాను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా. డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9గంటలకు నేను సిద్దం. ఫస్ట్ మూసీ నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్అండ్ఆర్ కాలనీ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కు మీదకు పోదాం. అక్కడే కూర్చొని బాధితులతో మాట్లాడుదాం. అని హరీష్ రావు తెలిపారు.