Home Page SliderNational

తీహార్ జైల్ అధికారి నిర్వాకం

ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ తయారీ ఫాక్టరీని ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు. అక్టోబర్ 25న జరిగిన దాడులలో ఒక ఇంట్లో మెథ్ ల్యాబ్‌ను కనిపెట్టారు. అయితే దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిని తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త, ముంబయికి చెందిన కెమిస్ట్ కలిసి నిర్వహిస్తున్నట్లు తేలింది. దీనిలో తిహార్ జైలు అధికారి పాత్ర ఉండడంతో వారు నిర్ఘాంతపోయారు. ఘన, ద్రవ రూపాలలోని 95 కిలోల మెథ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యం మెథాంపెటమైన్ తయారీ కోసం విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పరికరాలు కూడా లభించాయి. గతంలో ఒక కేసులో అరెస్టు చేసిన వ్యాపారవేత్తను తీహార్ జైలులో ఉంచడంతో వార్డెన్‌తో పరిచయం చేసుకుని అతనిని కూడా ఈ వ్యాపారంలో దింపినట్లు తెలుస్తోంది.