Andhra PradeshHome Page Slider

పల్నాడు జిల్లాలో పెద్దపులుల బీభత్సం

పల్నాడు జిల్లాలో పెద్దపులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. టైగర్ రిజర్వ్ నుండి జిల్లాలోకి ప్రవేశించాయి రెండు పెద్దపులులు. ఇవి దుర్గి మండలంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు అటవీ సిబ్బంది. దీనివల్ల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా ఉంది. గజాపురంలో ఒక ఆవును చంపేసింది పెద్దపులి. ఊరికి దగ్గర్లో పులి అడుగులను గుర్తించి,. ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. అక్కడ సిబ్బందితో డిఎఫ్‌వో సమీక్ష నిర్వహించారు. పులుల సంచారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 20 రోజుల ముందు నుండే అక్కడి స్థానికులు పులి అడుగులను గుర్తించి, ఫారెస్ట్  అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కెమెరాలు పెట్టి, వాటిని పట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. వారి పశువులను అక్కడ నుండి తీసుకెళ్లిపోయారు. కానీ పక్కనే ఉన్న గ్రామంలోనే ఆవును చంపడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.