Home Page SliderInternational

కుక్కలకి పులి రంగులేసి జూపార్క్ పబ్లిసిటీ..

ఒక జూ పార్క్ నిర్వాహకులు కుక్కలకి పులి రంగులేసి పబ్లిసిటీ చేయడంతో పర్యాటకులు మండిపడుతున్నారు. ఈ ఘటన చైనాలోని ఒక జూ లో జరిగింది. గతంలో కూడా కుక్కలకు పాండా రంగులేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ తైజౌలోని ఒక జూలో చౌచౌ అనే రకం కుక్కలకి నల్లని, పసుపు రంగులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీనితో చేసేది లేక జూ నిర్వాహకులు పబ్లిసిటీ కోసమే అలా చేశామని ఒప్పుకున్నారు. వీటి వల్ల కుక్కల ఆరోగ్యానికి ప్రమాదం లేదన్నారు. అయినా ప్రజలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.