కుటుంబంలో ఒకరికే టిక్కెట్: చంద్రబాబు
ఏపీ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఆయన ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈసారి కొంతమంది కీలక నేతలకు షాక్ తప్పదనే ప్రచారం జరుగుతోంది.