మూడేళ్ల బాలుడు కిడ్నాప్
ఓ మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కి గురయ్యాడు. ఈ ఘటన నల్గొండలో చోటు చేసుకుంది. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈనెల 4న మధ్యాహ్నం సమయంలో బాలుడును దుండగుడు ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు తో పోలీసులు విచారణ చేపట్టారు. గత మూడేళ్ళుగా ఆసుపత్రి ఆవరణలోనే బాధిత కుటుంబo నివాసo ఉంటున్నారు. విచారణలో భాగంగా దుండగుడు బాలుడిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ మేరకు బాలుడి ఆచూకీ కనిపెట్టెందుకు రెండు ప్రత్యేక పోలీసు టీంలను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది.