ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీ స్ట్రాంగ్ రూం వద్ద మూడంచెల భద్రత
సిద్దిపేట: స్ట్రాంగ్ర్ రూం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను ఎన్నికల అబ్జర్వర్లు, జిల్లా పోలీస్ అబ్జర్వర్, జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో శుక్రవారం అధికారులు భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంల వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాల సాయంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. బందోబస్తును ఎప్పటికప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.