మందుపాతర పేలి ముగ్గురు పోలీసుల మృతి..!
తెలంగాణాలోని ములుగు జిల్లాలో మందుపాతర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తుండగా ఈ మందుపాతర పేలింది. వెంకటాపురం మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో 17 రోజులుగా ఈ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు.