అరుదైన గౌరవం పొందిన ధోని,యువరాజ్,రైనా
టీమిండియా మాజీ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని,సురేష్ రైనా,యువరాజ్ సింగ్‌లు క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే ఈ ముగ్గురు ఆటగాళ్లకు మరో అరుదైన అవకాశం లభించింది. ప్రతిష్టాత్మక మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్(MCC)లో వీరు జీవితకాల సభ్యత్వాన్ని పొందారు. కాగా ఈ విషయాన్ని MCC తాజాగా ప్రకటించింది. అయితే ధోని ,యువరాజ్ సింగ్‌లు 2007 ICC ,T20 మెన్స్ వరల్డ్ కప్,2011 ICC మెన్స్ వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా ఉన్నారు. అంతేకాకుండా సురేష్ రైనా తన 13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో వన్డేల్లో 5,500 పరుగులు సాధించారు. వీటిని ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న MCC ఈ ముగ్గురికి ఈ క్లబ్‌లో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. వీరిలో మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం IPL లో RCB టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.