accidentHome Page SliderTelanganatelangana,

డ్రైవింగ్‌లో హార్ట్ ఎటాక్..ముగ్గురు మృతి..

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన సోమారపు ప్రవీణ్‌కుమార్(40) కి కార్ డ్రైవింగ్‌లో వచ్చిన హార్ట్ ఎటాక్ అతనితో పాటు, అతని కుటుంబాన్ని బలితీసుకుంది. ఎల్‌ఐసీ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ వారాంతపు సెలవులలో తన తలిదండ్రులతో గడపడానికి  అతని భార్య కృష్ణవేణి, వారి పిల్లలు సాయిచైత్ర(5), కుమారుడు సాయివర్థన్(3) లతో కలిసి సొంతూరికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో అతనికి ఛాతీ నొప్పి వచ్చింది. ఆసుపత్రికి వెళ్లాలని కారు వెనక్కు తిప్పుతుండగా ప్రమాదవశాత్తూ వరంగల్ జిల్లా కొంకపాక శివార్లులోని ఎస్సారెస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. దీనితో కంగారు పడిన కృష్ణవేణి తన ఒడిలోని కుమారుడిని రక్షించాలని కారులో నుండి విసిరేసింది. అనంతరం ఆమె కూడా కాలువలోకి దూకారు. స్థానికులు ఆమెను తాళ్ల సహాయంతో కాపాడారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కారు వందమీటర్లు కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో భర్త, కుమార్తె, కుమారుడు ముగ్గురూ మృతి చెందడంతో ఆమె బోరున విలవించింది. కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఎవరికోసం బతకాలంటూ విలపించారు. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.