Home Page SliderNational

కారులో చిక్కుకు పోయిన ముగ్గురు చిన్నారులు -ఊపిరాడక మృతి

మహారాష్ట్రలోని నాగపూర్‌లో  దారుణం జరిగింది. అప్పటి వరకూ సరదాగా ఆడుకుంటూ గడిపిన ముగ్గురు చిన్నారులు ఫిరోజ్ ఖాన్(4), అలీయా ఫిరోజ్ ఖాన్(6), అఫ్రిన్ ఇర్షద్ ఖాన్(6) లు శనివారం సాయత్రం నుండి కనిపించకుండా పోయారు. మొదట్లో గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారనుకున్న తల్లిదండ్రులు, రాత్రి చీకటి పడినా రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ జరిగిందనుకుని ఆకోణంలో కేసు నమోదు చేసిన పోలీసులు వారికోసం తీవ్రంగా గాలించారు. 24 గంటల తర్వాత చివరకి ఇంటికి సమీపంలోనే 50 మీటర్ల దూరంలో ఓ కారులో తుక్కు దుకాణం ముందు కనిపించారు. కానీ దురదృష్టవశాత్తూ అప్పటికే వారు మృతి చెందారు. ఆడుకుంటూ పిల్లలు కారులో ఎక్కి ఉంటారని, కారు డోర్ లాక్ పడిపోవడం వలన ఊపిరాడక చనిపోయారని అర్థమయ్యింది. వీరిలో ఇద్దరు అక్కచెళ్లెళ్లని, అఫ్రిన్  వారి స్నేహితురాలని గుర్తించారు. కార్లు నిర్లక్ష్యంగా లాక్ చేయకుండా పార్క్ చేయడం. ఆటోమేటిక్ డోర్ లాక్ వల్ల ఈ ప్రమాదం జరిగింది.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పసి పిల్లలను  వారి తల్లిదండ్రులు తరచూ గమనించాల్సి ఉంటుంది.