మూడు రాజధానులే మా విధానం : సజ్జల
ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయినందునే సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన తెచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానం అని బుధవారం ఏపీ సచివాలయ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు.విశాఖలో పాలన రాజధాని ఉంటుందని, కర్నూలులో న్యాయ రాజధాని, అదేవిధంగా శాసన రాజధాని అమరావతిలో కొనసాగుతుందని చెప్పారు. మంత్రులు ధర్మాన, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పారని విశాఖ ఒక్కటే రాజధాని అని అనలేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ప్రజలను గందరగోళం పరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. విశాఖలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని అందుకే తాము అక్కడ మారిపోతున్నామని జగన్మోహన్ రెడ్డి అన్నారని ఇందులో ప్రతిపక్షాలకు కడుపు మంట ఏమిటని ప్రశ్నించారు. రాజధానిపై నిర్ణయాధికారం సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని అందుకే సీఎంగా చంద్రబాబు అమరావతి రాజధానిని ప్రతిపాదించినప్పుడు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న జగన్ అంగీకరించారని చెప్పారు. ఎన్నికలకు వెళ్ళటం కోసం మూడు రాజధానుల అంశాన్ని తాము తెర మీదకు తీసుకురాలేదని మొదటి నుంచి మా విధానం వికేంద్రీకనేనని అందులో భాగంగానే తామాధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టామని చెప్పారు. వికేంద్రీకరణకు ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టే అమరావతి రైతుల పేరుతో చేసిన పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చిన వారి మధ్యలోనే ఆపేసి వెనక్కి వచ్చారని చెప్పారు. వికేంద్రీకరణ ఒక్క నినాదంతోనే ఎన్నికలకు వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు చాలా ఉన్నాయని అందులో వికేంద్రీకరణ కూడా ఒక భాగమని తెలిపారు.