తెలంగాణ సచివాలయాన్ని పేల్చి వేస్తానని బెదిరింపులు
తెలంగాణ సచివాలయాన్ని పేల్చేస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుండి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే బాంబు నిర్వీర్య టీంలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు. కానీ అది ఫేక్ కాల్ అని ఎలాంటి బాంబు లేదని తెలిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు SPF పోలీసులు. ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి గత మూడు రోజుల నుంచి పలుమార్లు ఫోన్ చేస్తున్నాడు. లంగర్ హౌజ్‌కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వయసు 22 సంవత్సరాలుగా గుర్తించారు. దర్గాకు సంబంధించి ఓ సమస్య పై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నాడు. అయితే.. తాను పెట్టిన అర్జిని అధికారులు స్పందించక పోవడంతో ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డానని అన్నాడు.