Home Page SliderNational

ఏప్రిల్ 30 న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తా..!

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఖాన్ సల్మాన్ ఖాన్‌కు ఇటీవల చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇటువంటి బెదిరింపు కాల్ ఆయనకు మళ్లీ వచ్చింది. కాగా నిన్న తన పేరు రాకీ భాయ్ అని,తనది రాజస్థాన్ జోధ్‌పూర్ అని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేశారు. ఈ కాల్‌లో అతను ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసుల దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.  ఇటువంటి బెదిరింపు కాల్స్ ఈ మధ్య తరచూ వస్తుండడంతో సల్మాన్ ఖాన్ కూడా తన భద్రత కోసం ఇటీవలే ఓ ఖరీదైన బుల్లెట్ ఫ్రూఫ్ కార్‌ను కొనుగోలు చేశారు.