Andhra PradeshHome Page Slider

బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. భయంగా ఉంది: యాంకర్ శ్యామల

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యింది. అయితే దీనిపై వైసీపీ తరుపున  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యాంకర్ శ్యామల తొలిసారిగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. చాలా భయంగా ఉందన్నారు. తాను ఏపీలో వైసీపీ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నించానని..ఎవరిని తిట్టలేదని స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా ఎవరిపై విమర్శలు చేయలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలను ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దని శ్యామల కోరారు.