NewsTelangana

వేల మంది కేసీఆర్‌లు వచ్చిన ప్రధానిని అడ్డుకోలేరు

టీఆర్‌ఎస్‌ ఎన్ని రోజులు అధికారంలో ఉంటే రాష్ట్రానికి అంతకాలం నష్టం జరుగుతూనే ఉంటుందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి బేగంపేట్‌ సభలో పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వస్తే కనీస మర్యాద లేదని ఆయన పేర్కొన్నారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టి ఏం సాధిస్తారన్నారు. కేసీఆర్‌కు పదవి తప్ప, రాజకీయాలు తప్ప తెలంగాణ అభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నించారు. వేల మంది కేసీఆర్‌లు వచ్చినా ప్రధాని మోదీ రాకు అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని మోదీ తెలంగాణకు వస్తూనే ఉంటారని చెప్పారు. కేసీఆర్‌ వైఖరి వల్లే తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తోందన్నారు. తెలంగాణలో పూర్తిగా నియంతృత్వం ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజా సంఘాలను, రైతు సంఘాలను అవమానిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా కుటుంబ పాలనకే అంకితమైందన్నారు కిషన్‌ రెడ్డి.