వేల కోట్లు ఇచ్చినా ఆమె ప్రాణాలను తేలేరు
సంధ్య థియేటర్ తొక్కిస లాట ఘటనలో బాధిత కుటుంబానికి వేల కోట్లు ఇచ్చినా కూడా వారి ప్రాణాలు తిరిగి తెచ్చి ఇవ్వలేరని సీసీఐ లీడర్ నారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప సినిమాతో అమాయక మహిళ ప్రాణాలు కోల్పొవడం బాధాకారం ‘ ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే ప్రజలు ఆదరిస్తారు. వేల కోట్ల లాభాలు వచ్చే సినిమాలకు ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంచేందుకు పర్మిషన్లు ఇవ్వడం ఎందుకు? పుష్ప 2 సినిమాలో అసలు ఏముంది?.. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దు తున్నారు. టికెట్ల ధరలను పెంచడం బ్లాక్ మార్కెట్లకు ప్రోత్సాహం ఇవ్వడమే అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు సామాన్య ప్రజలకు భారం పడకుండా ఉండాలి’ అని నారాయణ అన్నారు.

