హిందీ వ్యతిరేకులు దేశ ద్రోహులే..!
తమిళనాడు భాష దోషం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.స్టాలిన్ ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల తమిళుల పట్ల ఏహ్యతా భావాన్ని ప్రేరేపిస్తున్నాయి.రూపాయి సింబల్‌ని మార్చడం, గవర్నర్ ప్రసంగంలో జాతీయ గేయాన్ని తొలగించడం,హిందీ మాట్లాడే వారిని అంటరాని వాడిగా చూడటం లాంటి చర్యలతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది.తాజాగా ఈ విషయంపై నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.హిందీని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అన్నారు.అలాంటి వారంతా దేశ ద్రోహులౌతారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాంటి వారంతా దేశం విడిచి వెళ్లిపోవడం బెటర్ అంటూ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.దీంతో రనౌత్ వ్యాఖ్యల పట్ల అరవం వారంతా మండిపడుతున్నారు.