Andhra PradeshHome Page Slider

ఎన్నికల్లో టికెట్ రానివారు అదృష్టవంతులు… మాజీ మంత్రి దగ్గుబాటి

పార్టీ అధిపతులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాలను చేశారంటూ విచారం వ్యక్తం చేశారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దేశ వ్యాప్తంగా సింగిల్ మెన్ పార్టీల్లో ఇదే శైలి అన్నారు. ఎమ్మెల్యేలు పనిచేస్తామన్న భావన లేకుండా పోయిందన్నారు. 40 కోట్లు, 30 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు దగ్గుబాటి. గెలిచిన తర్వాత ఎందుకు గెలిచామా అని బాధపడతున్నారన్నారు. ఎవరికైతే టికెట్లు రావో వారు అదృష్టవంతులన్నారు. 30, 40 కోట్లు మిగిలినట్టేనన్నారు. వాళ్ల పిల్లలను రోడ్లపైనే పడేయడమేనన్నారు. గెలిచిన తర్వాత సంపద అంతా ఒకచోటకే వెళ్తోందన్నారు. ఓడిపోయినవారు అక్కడ ఏడుస్తారని, గెలిచినవారు ఇంటికెళ్లి ఏడుస్తారన్నారు. ఎవరిపైనా కక్షతో ఇలా చెప్పడం లేదన్నారు. టికెట్ రాని వారంతా అదృష్టవంతులని చెప్పారు. భగవంతుడు నిజమైన ప్రజాప్రతినిధులను కాపాడాలన్నారు.