ఆ రెండు మేయర్ స్థానాలు కూటమి ఖాతాలో..
ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకు ఉత్కంఠగా కొనసాగిన విశాఖ, గుంటూరు మేయర్ ఎన్నిక సోమవారం ఏకగ్రీవమైంది. విశాఖపట్నం, గుంటూరు మేయర్ స్థానాలను కూటమి ప్రభుత్వం సొంతం చేసుకుంది. కూటమి అభ్యర్ధి పీలా శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీలా శ్రీనివాస్ ను మేయర్ అభ్యర్ధిగా జనసేన పార్టీ ప్రతిపాదించగా.. బీజేపీ బలపర్చింది. దీంతో ఎన్నిక ప్రారంభమైన 10 నిమిషాల్లోనే మేయర్ పేరును అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మేయర్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉండటంతో విజయం ఏకగ్రీవమైంది. అటు గుంటూరు మేయర్ స్థానాన్ని కూడా కూటమి పార్టీ దక్కించుకుంది. గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.