ఆ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారాయి..
కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ రాష్ట్రం ఆ పార్టీకి ఏటీఎంలా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ అకోలాలో పర్యటించారు. మహా వికాస్ అఘాడీ అంటేనే అవినీతి, వేల కోట్ల రూపాయల కుంభకోణాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘నవంబర్ 9 చాలా చారిత్రాత్మకమైనది. 2019 లో ఇదే రోజున సుప్రీంకోర్టు రామ మందిర తీర్పును వెలువరించింది. ప్రధానిగా నా మొదటి రెండు పర్యాయాల్లో పేదలకు నాలుగు కోట్ల పక్కా ఇళ్లు ఇచ్చాను. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కోసం మీ ఆశీర్వాదం కోసం వచ్చాను” అని ప్రధాని మోదీ అన్నారు.

