ఆ నలుగురు….అనంత లోకాలకు
అప్పుల బాధలు తాళలేక ఓ కుటుంబం నిండు ప్రాణాలను విడిచేసింది.ఇద్దరు పిల్లలు సహా భార్యభర్తలిరువురూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైద్రాబాద్‌లో జరిగింది.హబ్సిగూడలోని రవీంద్ర నగర్ లో నివాసం ఉండే చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో నారాయణ విద్యాసంస్థల్లో లెక్చరర్‌గా పనిచేశాడు.అనివార్య కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు.అప్పటి నుంచి కుటుంబ పోషణ కష్టతరంగా మారడంతో విపరీతంగా అప్పులు చేశారు.అప్పుల వాళ్లు ఇంటికొచ్చి నిలదీస్తుండటం,భార్యబిడ్డల్ని పోషించుకోలేకపోవడంతో పిల్లలను చంపి ఆ తర్వాత భార్యభర్తలిరువురూ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

